తాజా వార్తలు

నేరాలు తగ్గించడంలో తెలంగాణ పోలీసులు సక్సెస్ అయ్యారు: మంత్రి మహమూద్ అలీ

నేరాలు తగ్గించడంలో తెలంగాణ పోలీసులు సక్సెస్ అయ్యారు: మంత్రి మహమూద్ అలీ
X

నేరాలను తగ్గించడంలో తెలంగాణ పోలీసులు ఎంతో సఫలమయ్యారని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. శాంతి భద్రతలు అదుపులో ఉన్నప్పుడే రాష్ట్రాలకు పెట్టుబడులు వస్తాయని ఆయన తెలిపారు. బేగంపెట్ లోని ఐటీసీ కాకతీయలో హైదరాబాద్ పోలీసుల కమిషనరేట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ లోగో ను ఆయన ఆవిష్కరించారు. హైదరాబాద్ ఎంతో ఆభివృద్ది చెందుతున్న నగరమని.. ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగ ఉపాధి కోసం, అవకాశాలు కోసం హైదరాబాద్ వస్తున్నారని అన్నారు. హైదరాబాద్ లో అధునాతన సాంకేతిక విధానంతో కమాండ్ కంట్రోల్ ను నిర్మిస్తున్నామని మరో 5 నెలల్లో ప్రారంబిస్తామని దీని వల్ల భద్రత పర్యవేక్షణ మరింత సులభం అవుతుందన్నారు.

Next Story

RELATED STORIES