చంద్రబాబు మాజీ పీఎస్ దగ్గర రూ.2 వేల కోట్లు దొరికాయంటూ కట్టుకథ అల్లారు : అచ్చెన్నాయుడు

జగన్‌లా అందరూ అవినీతిపరులే అని ముద్ర వేయడానికి వైసీపీ నేతలు కష్టపడుతున్నారంటూ ట్విట్టర్‌లో ఫైర్ అయ్యారు టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు. దేశంలో 40 ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో రూ.85 లక్షలు దొరికాయని ఐటీ శాఖ అంటుంటే.. చంద్రబాబు మాజీ పీఎస్ దగ్గర రూ.2 వేల కోట్లు దొరికాయంటూ వైసీపీ కట్టుకథ అల్లిందన్నారు. గతంలో వైఎస్ కూడా చంద్రబాబుపై అవినీతి మరక అంటించాలని ప్రయత్నించి 26 ఎంక్వైయిరీ కమిటీలు వేసి కోర్టు చివాట్లు పెట్టే పరిస్థితికి తెచ్చుకున్నారన్నారు. ఇప్పుడు వైసీపీ ఉస్కోబ్యాచ్ తయారైందంటూ ట్విట్టర్‌లో ఘాటుగా విమర్శించారు. జగన్ దగ్గర మెప్పు పొందడమే లక్ష్యంగా.. అసలు ఐటీ శాఖ ఏం చెప్పిందో తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తున్నారు. అవినీతి అని అరవడం తప్ప 9 నెలల్లో 9 రూపాయలు అవినీనితి జరిగిందని నిరూపించలేకపోయారన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com