జాతీయ జనాభా పట్టిక తయారీపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం

జాతీయ జనాభా పట్టిక తయారీపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం
X

జాతీయ జనాభా పట్టిక తయారీపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం సంప్రదింపులు చేపట్టింది. ముఖ్యమంత్రులు, ఉన్నత స్థాయి అధికారులతో చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా కేంద్ర జనాభా లెక్కల విభాగం రిజిస్ట్రార్ జనరల్ వివేక్ జోషీ, పంజాబ్ సీఎం అమరీందర్‌సింగ్‌ను కలిశారు. NPR తయారీ ఆవశ్యక తను వివరించారు. పంజాబ్‌లో NPRను ప్రిపేర్ చేయడానికి సహకరించాలని కోరారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో NPR ప్రిపరేషన్ ప్రారంభం కానుంది. ఐతే, పౌరసత్వ సవరణ చట్టంపై వివాదం నేపథ్యంలో NPR, NRCలపైనా రగడ రాజుకుంది. కేరళ, బెంగాల్, పంజాబ్, రాజస్థాన్ ప్రభుత్వాలు CAAకి వ్యతిరేకంగా తీర్మానాలు చేశాయి. కేరళ, బెంగాల్ ప్రభుత్వాలు NPR తయారీని కూడా ఆపేశాయి. కేరళ సర్కారు ఏకంగా NPRపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్రాల్లోని ఎన్డీయేతర ప్రభుత్వాలు NPR ప్రిపరేషన్‌పై అభ్యంతరం తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాల అభ్యంతరాలను తొలగించి, అనుమానాలను నివృత్తి చేయడానికి కేంద్రం చర్యలు చేపట్టింది.

Next Story

RELATED STORIES