ఆనంద్ మహింద్రా ట్వీట్.. ఇండియన్ ఉస్సేన్ బోల్ట్‌కు బంపరాఫర్

ఆనంద్ మహింద్రా ట్వీట్.. ఇండియన్ ఉస్సేన్ బోల్ట్‌కు బంపరాఫర్

పరుగుల వీరుడు అంటే ఉస్సేన్ బోల్ట్ పేరే గుర్తుకు వస్తుంది. అబ్బురపరిచే వేగంతో అద్భుత రికార్డులను సృష్టించాడు. సమీప భవిష్యత్తులో ఆ రికార్డులను ఎవ్వరూ తుడిపేయలేరని వార్తలు కూడా వచ్చాయి. కానీ, అంతటి ఏస్ స్ప్రింటర్ కూడా తన రికార్డుల పట్ల నమ్మకం కోల్పోతాడేమో. అతని వేగాన్ని చూసి జెలసీ ఫీలవుతాడేమో. చిరుతపులిలా లంఘించి దూకుతున్న అతని స్పీ డ్‌ ముందు బోల్డ్ కూడా తేలిపోతాడేమో.. అతనే శ్రీనివాస గౌడ. ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. ఈ కన్నడ యువకుడు 100 మీటర్ల దూరాన్ని 9.55 సెకన్లలోనే పూర్తి చేశాడు. ఈ స్పీడ్‌ చూసి అంతా థ్రిల్ అయిపోయారు. ఉస్సేన్ బోల్ట్‌ను మించిన పరుగులు వీరుడు వచ్చాడూ అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోయింది.

ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రా కూడా శ్రీనివాస గౌడపై ట్వీట్ చేశారు. ప్రభుత్వం శ్రీనివాసగౌడకు శిక్షణ ఇచ్చి ఒలింపిక్స్‌కు పంపించాలని సూచించారు. ఇదే విషయాన్ని కేంద్రమంత్రి కిరణ్ రిజీజు దృష్టికి తీసుకెళ్లారు. శ్రీనివాసగౌడ శారీరక దారుఢ్యాన్ని చూడాలని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. 100 మీటర్ల స్ప్రింట్‌లో శిక్షణ ఇప్పించాలని అభిప్రాయపడ్డారు.

శ్రీనివాసగౌడపై ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కు కిరణ్ రిజీజు పాజిటివ్‌గా స్పందించారు. శ్రీనివాస్‌ను శాయ్‌కు పిలిపిస్తామని హామీ ఇచ్చారు. ట్రయల్స్ కోసం కోచ్‌ల వద్దకు పంపిస్తామని చెప్పారు. ప్రతిభ కలిగిన వ్యక్తులను ఎప్పటికీ వదులుకోబోమని స్పష్టం చేశారు. ఆనంద్ మహింద్రా ట్వీట్‌తో శ్రీనివాసగౌడ మరింత పాపులర్ అయ్యాడు. బాలీవుడ్, పొలిటికల్ ప్రముఖులు కూడా శ్రీనివాస్ ప్రతిభను మెచ్చుకుంటున్నారు. మొత్తానికి కంబళ పోటీల్లో అద్భుత పర్‌ఫార్మెన్స్‌తో శ్రీనివాసగౌడకు శాయ్‌కు వెళ్లే అవకాశం వచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story