తాజా వార్తలు

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మరో కీలక ఘట్టం

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మరో కీలక ఘట్టం కనువిందు చేస్తోంది. లక్ష్మీ పంప్‌హౌస్‌ నుంచి నీటి ఎత్తిపోతలు మళ్లీ ప్రారంభమయ్యాయి. డిసెంబరు 28న ఆగిన విద్యుత్తు మోటార్లు.. శనివారం రాత్రి మళ్లీ ప్రారంభమయ్యాయి. 11 మోటార్ల ద్వారా 24వేల 200 క్యూసెక్కుల నీటిని ఇరిగేషన్‌ ఇంజనీరింగ్‌ అధికారులు సరస్వతీ బ్యారేజీలోకి ఎత్తిపోయిస్తున్నారు. ప్రాజెక్టు ప్రారంభమైన నాటి నుంచి 11 మోటార్లతో ఒకేసారి నీటిని ఎత్తిపోయించడం ఇదే మొదటిసారి. రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ద్వారా 8 రోజుల్లో ప్రాజెక్టు ఖాళీ అవుతుందని ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. దీంతో ముంపునకు గురవుతున్న పంట చేలకు ఉపశమనం లభించనుంది.

Next Story

RELATED STORIES