తాజా వార్తలు

ఎల్ అండ్ టీ మెట్రో అధికారులతో మంత్రి కిషన్ రెడ్డి సమీక్షా సమావేశం

ఎల్ అండ్ టీ మెట్రో అధికారులతో మంత్రి కిషన్ రెడ్డి సమీక్షా సమావేశం
X

హైదరాబాద్‌లోని దిల్ కుషా అతిథి గృహంలో ఎల్ అండ్ టీ మెట్రో అధికారులతో మంత్రి కిషన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్‌ అండ్ టీ ఎండీ కేవీబీ రెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్ ఎంపీ నాయుడుతో పాటు ఇతర అధికారులు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.

జేబీఎస్ - ఎంజీబీఎస్ మెట్రో రైలు ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కిషన్‌రెడ్డి. కేంద్ర ప్రభుత్వ సహకారం లేనిదే మెట్రో ప్రాజెక్టు నిర్మించారా అని అధికారులను నిలదీశారు. కేంద్రం ఇవ్వాల్సిన రూ.250 కోట్ల నిధుల గురించి ఇక ఢిల్లీకి రావొద్దని హెచ్చరించారు. రాజకీయ దురుద్దేశంతోనే తనకు ఆహ్వానం పంపలేదని అసహనం వ్యక్తం చేశారు.

స్థానిక ఎంపీ, కేంద్రమంత్రికి ఆహ్వానం లేకుండా జేబీఎస్‌- ఎంజీబీఎస్ మెట్రోను ప్రారంభించారంటూ విమర్శించారు అధ్యక్షుడు లక్ష్మణ్‌. కేసీఆర్‌ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. ఫలక్‌నుమా వరకు మెట్రో ఉన్నా.. ఎంజీబీఎస్‌ వరకే ఎందుకు పరిమితం చేశారని ప్రశ్నించారు. పాత బస్తీలో మెట్రోను ఎంఐఎం నేతలు అడ్డుకుంటున్నారన్నారు.

మెట్రో అధికారులతో సమీక్ష అనంతరం మంత్రి కిషన్ రెడ్డి జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రైల్లో ప్రయాణించారు. ఆయనతో పాటు తెలంగాణ బీజేపీకి చెందిన పలువురు నేతలు మెట్రో రైల్లో ప్రయాణించారు.

Next Story

RELATED STORIES