అమరావతి కోసం ఆగిన మరో రైతు కూలీ గుండె

అమరావతి కోసం ఆగిన మరో రైతు కూలీ గుండె
X

అమరావతి పోరాటంలో అలిసిపోయి మరో గుండె ఆగింది. వెలగపూడికి చెందిన జెట్టి సోమేలు తీవ్రమైన మనోవేదనతో ప్రాణాలు వదిలాడు. రాజధాని తరలిపోతోంది, పనులు ఉండవని కొన్నాళ్లుగా సోమేలు ఆవేదనతో ఉన్నాడు. రోజూ రాజధాని ఆందోళనల్లో పాల్గొంటున్నాడు. ప్రభుత్వ మొండి వైఖరితో భవిష్యత్‌పై తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే సోమవారం ప్రాణాలు వదిలాడు. దీంతో వెలగపూడిలో విషాదం నెలకొంది. దీక్షా శిబిరం వద్ద రైతులంతా సోమేలుకు నివాళులు అర్పించారు. పదుల సంఖ్యలో రైతులు, రైతు కూలీలు మరణిస్తున్నా ప్రభుత్వం కనీసం తమను పట్టిచుకోవడం లేదని 29 గ్రామాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. 3 రాజధానుల పేరుతో ఇంకెంత మందిని బలి తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు.

Tags

Next Story