Top

మీరు రైతులా..? బ్రోకర్లా..?: ఎమ్మార్వో వనజాక్షీ

మీరు రైతులా..? బ్రోకర్లా..?: ఎమ్మార్వో వనజాక్షీ
X

విజయవాడ రూరల్ కొత్తూరు తాడేపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పేదల ఇళ్ల స్థలాలకు వ్యవసాయ భూములను పంపిణీ చేయడానికి.. ఎమ్మార్వో వనజాక్షి సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, తాము ఎప్పటి నుంచో సాగుచేసుకుంటున్న భూములను తీసుకోవడమేంటని మహిళా రైతులు నిలదీశారు. ఎమ్మార్వోపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే, మీకు చెప్పాల్సన అవసరం మాకు లేదంటూ ఎమ్మార్వో వనజాక్షి దురుసుగా ప్రవర్తించారు. రైతులు గట్టిగా నిలదీయడంతో మీరు రైతులా..? బ్రోకర్లా..? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో తమను బ్రోకర్లని అంటారా..? అని మహిళా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మహిళలని కూడా చూడకుండా తహసిల్దార్ వనజాక్షితో పాటు.. రెవెన్యూ సిబ్బంది కూడా దురుసుగా ప్రవర్తించారు. మహిళా రైతులపై దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Next Story

RELATED STORIES