తాజా వార్తలు

తెలంగాణ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు

తెలంగాణ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు
X

ఆరు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన తెలంగాణ కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పౌరసత్వం విషయంలో మత పరమైన వివక్ష చూపరాదని కేంద్రాన్ని కోరింది తెలంగాణ మంత్రివర్గం. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించింది. ఈ కేబినెటీలో పట్టణ ప్రగతి, రాజీవ్ స్వగృహ, అభయహస్తం, వడ్డీలేని రుణాలపై చర్చించింది. ఈ నెల 24 నుంచి 10 రోజుల పాటు పట్టణ ప్రగతి నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం వేయాలని కూడా మంత్రివర్గం డిసైడ్ చేసింది.

ముఖ్యంగా పల్లె ప్రగతి ఫలితాలతో ఇక పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. పట్టణ ప్రగతికి సన్నాహకంగా ఈ నెల 18న ప్రగతిభవన్ లో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించి విధివిధానాలపై చర్చించనుంది. మేయర్లు, మున్సిపల్ చైర్ పర్సన్లు, కమిషనర్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లను ఈ సమావేశానికి ఆహ్వానించనున్నారు. ఈ సదస్సులో పాల్గొన్న వారందరినీ అదే రోజు మధ్యాహ్నం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నిర్మించిన వెజ్-నాన్ వెజ్ మార్కెట్ ను, స్మశాన వాటికలను సందర్శించడానికి తీసుకెళతారు.

రాజీవ్ స్వగృహ ఇళ్ళను వేలం ద్వారా అమ్మేయాలని కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయడానికి చిత్రా రామచంద్రన్ అధ్యక్షతన రామకృష్ణారావు, అరవిందకుమార్ సభ్యులుగా అధికారుల కమిటీని నియమించింది. అభయహస్తం పథకం సమీక్ష బాధ్యతను మంత్రి టి.హరీశ్ రావు, ఐఎఎస్ అధికారి సందీప్ సుల్తానియాలకు అప్పగించింది. అలాగే అసెంబ్లీ బడ్టెట్ సమావేశాల్లో లోకాయుక్త బిల్లు ప్రవేశ పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది.

Next Story

RELATED STORIES