అమెరికా అధ్యక్షడు వాహనమే పెద్ద సైన్యం.. ఫుల్ సెక్యూరిటీ

అమెరికా అధ్యక్షడు వాహనమే పెద్ద సైన్యం.. ఫుల్ సెక్యూరిటీ

ట్రంప్ భారత పర్యటనా సందర్బంగా భద్రతా సిబ్బంది పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్లన్ని ఒక ఎత్తైతే.. ఇరు దేశాధినేతలు ట్రంప్, మోదీలు ప్రయాణించే వాహనాలు ఒక ఎత్తు. అందుకే అమెరికా అధ్యక్షుడి ప్రయాణానికి వినియోగించే వాహనం మామూలుగా ఉండదు. అది ప్రపంచంలోనే అత్యంత భద్రత కల్గిన, సురక్షితమైన వాహనం. అదే ద బీస్ట్. ట్రంప్ ఏ దేశానికి వెళ్లినా.. ఈ వాహనాన్ని ఆ దేశానికి చేర్చాల్సిందే. ఎందుకంటే ఇది ఎలాంటి దాడులనైనా తట్టుకునే సామర్ధ్యం దీనిసొంతం. దీని ప్రత్యేకతలను ఓసారి చూద్దాం..

అమెరికా అధ్యక్షుడి ప్రయాణానికి వినియోగించే కారుపేరు ద బీస్ట్. దీని రూపకల్పన శతాబ్దం క్రితమే జరిగింది. మాజీ అధ్యక్షుడు హర్బర్ట్ హూవర్ సమయంలో 1910లోనే ప్రెసిడెంట్ కాన్వాయ్ లో వాహనాన్ని ప్రవేశపెట్టారు. కాలానికి అనుగుణంగా ఎన్నో మార్పులు చేశారు.

బీస్ట్ కారు అద్దాలు ఎంతో ధృడమైనవి. ఐదు లేయర్స్ గ్లాస్, పోలీకార్బోనెట్ తో రూపొందిస్తారు. ఇది ఎలాంటి బుల్లెట్ దాడిలనైనా తట్టుకోగలవు. డ్రైవర్ విండోమాత్రమే కేవలం 3 అంగులాల మేర తెరుచుకుంటుంది. దీని డోర్ ప్రెసిడెంట్ ట్రంప్, కారు డ్రైవర్ మాత్రమే తెరిచేవీలుంటుంది. మరెవరు తీయలేదు.

బీస్ట్ వాహనం శక్తివంతమైన ఆయుధాల, టీయర్ గ్యాస్ దాడుల నుంచి ప్రెసిడెంట్ ను రక్షిస్తుంది. డ్రైవర్ క్యాబిన్ ఎంతో అత్యాధునిక టెక్నాలజీతో కలిగి ఉంటుంది. ఇందులో GPS ట్రాకింగ్ వ్యవస్థ ఉంటుంది. దీంతో ఎక్కడికి వెళ్లాలి అనేది స్పష్టంగా తెలుస్తుంది.

అమెరికా ప్రెసిడెంట్ ఉపయోగించే ద బీస్ట్ వాహనం బాడీ ఐదు అంగుళాల మందం ఉంటుంది. శక్తివంతమైన ఆయుధాల నుంచి ఎదురయ్యే దాడులను తట్టుకునేవిధంగా టైటానియం, అల్యూమినియం, సిరమిక్, స్టీల్ మిశ్రమంతో దీన్ని తయారు చేస్తారు.

వాహనం ముందుభాగం టీయర్ గ్యాస్, గ్రేనెడ్ లాంచర్ దాడులను పసిగట్టేలా సెన్సార్లు ఉంటాయి. అంతే దీనికి నైట్ విజన్ మూడు కెమెరాలు ఉంటాయి. దీని సహాయంతో అర్ధరాత్రివేళ సులభంగా గుర్తించవచ్చు. అరకిలోమీటర్ దూరాన్ని స్పష్టంగా చూడొచ్చు.

ఎంతో శక్తివంతమైన ఈ వాహనాన్ని నడిపించడం సాధారణ డ్రైవర్లకు సాధ్యంకాదు. రక్షణ సిబ్బందిలో ఒకరికి సీక్రెస్ సర్వీస్ ప్రత్యేకంగా శిక్షణ ఇస్తుంది. ఈ వాహనం డ్రైవర్ కు అత్యవసర సమయంలో వాహనంలో ఉన్న అధ్యక్షుడిని తప్పించేలా ట్రేయినింగ్ ఇస్తారు. ప్రతిరోజు వైద్యుడి పరీక్షల అనంతరం డ్రైవర్ విధుల్లోకి రావాల్సిఉంటుంది. భారీ వాహనమైన బీస్టును 180 డిగ్రీల కోణంలో మళ్లించి దూసుకుపోయేగా ట్రేయినింగ్ ఇస్తారు.

ఈ వాహనంలో అత్యాధునిక ఫోన్ సౌకర్యం ఉంటుంది. ఇందులోంచి శాటిలైట్ సహయంతో అమెరికా ఉపాధ్యక్షుడు, రక్షణ శాఖ ప్రధాన కార్యాలయమైన పెంటగాన్ తో నేరుగా మాట్లాడే ఏర్పాటు ఉంటుంది. ప్రెసిడెంట్ వాహనంలో నలుగురు ప్రయాణించవచ్చు. అత్యంతసర సమయంలో వాహనంలో ఉన్నవారికి ఆక్సిజన్ అందించే ఏర్పాటు ఉంటుంది. ఎమర్జెన్సీ బటన్ నొక్కగానే ఆక్సీజన్ సప్లైయ్ అవుతుంది. అధ్యక్షుడికి చెందిన బ్లడ్ బ్యాగ్స్ కూడా ఇందులోఉంటుంది.

ఈ వాహనంలో ఉపయోగించే ఆయిల్ ట్యాంక్ పేలుడుదాటిని తట్టుకునేలా తయారుచేస్తారు. డోర్లు కూడా ఎంతో మందంగా ఉంటాయి. బుల్లెట్ దాడుకు చెక్కుచెదరకుండా 8 అంగుళాల మందంతో ఉంటాయి. ఒక్కసారి మూసివేస్తే దాన్ని తెరువడం ఎవరికి సాధ్యకాదు. అంతేకాదు గన్ దాడులతోపాటు రసాయనక దాడులను సైతం ఇది తట్టుకుంటుంది.

ఈ బీస్ట్ వాహనానికి వాడే టైర్లుకూడా ఎంతో అత్యాధునిక టెక్నాలజీతో తయారుచేసినవే. ఇది పగిలిపోవడం, పంచర్ కావడం కానీ జరుగదు. ఒకవేళ టైర్లు పేలినా వాటితోనే తప్పించుకునే వీలుంటుంది. దీని రీములు స్టీల్ తో తయారుచేస్తారు. మొత్తంగా దీని బాడీ భారీ బాంబుదాడులు, మందుపాతర్లను సైతం తట్టుకునేలా ఉంటుంది. ఈ వాహనం పూర్తిగా సెన్సార్ తోపనిచేస్తుంది. అణుబాంబ్, కెమికల్ బాంబ్, బయోకెమికల్ బాంబు దాడులు జరిగినప్పుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గేర్ ఆటోమెటిక్ గా లాక్ అవుతుంది. దీంతో వాహనంలో ఉన్నవారికి ఎలాంటి హాని జరుగదు. ప్రమాదం నుంచి తప్పించుకునే వీలవుతుంది.

ద బీస్ట్ కు ఇంకో ప్రత్యేకత ఉంది. ఇది ఎక్కడ రోడ్డుమీద ప్రయాణిస్తున్నా శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా ప్రెసిడెంట్ నేరుగా వైట్ హౌజ్ సెక్యూరిటీతో మాట్లాడవచ్చు. ఆడియో, వీడియో ద్వారా సంభాషించవచ్చు. దీనికి ఉన్న ఆంటేనాలు ఇతర కమ్యూనికేషన్ సిస్టమ్స్ ను, రిమోట్ పేలుడు పదార్ధాలను జామ్ చేస్తుంది. అంతేకాదు దాడులకు పాల్పడే మానవ రహిత వాహనాలను గుర్తించి, వాటిని నిర్వీర్యం చేస్తాయి.

ట్రంప్ ను అనుసరించే వాహనాలు మరో12 వాహనాలు బీస్టు లాగానే ఉంటాయి. అయితే వీటిలో ఒర్జినల్ బీస్టు మాత్రం ఒక్కటే ఉంటుంది. అందులోనే ప్రెసిడెంట్ ఉంటారు. అయితే వాటిలో దేనిలో అధ్యక్షుడు ప్రయాణిస్తున్నాడన్నది ఎవరికి తెలియదు. వెనకాలే వచ్చే ఇతర వాహనాల్లో ప్రెసిడెంట్ పరీక్షించే వైద్యుడు, ప్రత్యేక భద్రతా అధికారి, కెబినెట్ మెంబర్, మిలటరీ, సీక్రెట్ అధికారులు ఉంటారు. ఎక్కడినుంచైనా దాడిజరిగినా వెంటనే తేరుకొని ఆయా వాహనాలపైనుంచే రక్షణ సిబ్బంది దుండగులను క్షణాల్లో మట్టుపెడుతారు.

ట్రంప్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత... ఒబామా ఉపయోగించిన ఆ వాహనానికే మరిన్ని మార్పులు చేశారు. 15 మిలియన్ డాలర్లుతో మరింత అత్యాధునీకరించారు. ఈ వాహనాన్ని తయారుచేసిన తర్వాత అన్నిరకాల టెస్టులు నిర్వహిస్తారు.. అన్నిటెస్టులు ఓకే అయిన తర్వాతనే కాన్వాయ్ లో చేరుస్తారు. ప్రెసిడెంట్ ఏ దేశం వెళ్లినా దీన్ని అక్కడికి తీసుకెళుతారు. ట్రంప్ గుజరాత్ పర్యటన సందర్బంగా ఈ వాహనంలోనే ప్రయాణిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story