ట్రంప్ చేత ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైన మోతెరా స్టేడియం

ట్రంప్ చేత ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైన మోతెరా స్టేడియం

అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్ పర్యటనకు గుజరాత్ ప్రభుత్వం సర్వం సిద్దం చేస్తోంది. అహ్మదాబాద్ లో దిగిన వెంటనే ఆయన రోడ్డుమార్గం గుండా సబర్మతి ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మోతెరా స్టేడియం చేరుకొని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని ట్రంప్ తో కలిసి మోదీ ప్రారంభిస్తారు. వీరి పర్యటన అంతా రోడ్డుమార్గం ద్వారానే సాగనుంది. విమానాశ్రయం నుంచి స్టేడియం వరకు ఉన్న 22 కిలోమీటర్ల మేర భారీగా స్వాగత ఏర్పాట్లు చేస్తారు. ఈ మార్గంలో ట్రంప్ కు గౌరవ సూచికంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రపంచంలోనే శక్తివంతమైన ఇరు దేశాధినేతలకు రక్షణ కల్పించడం భద్రతా సిబ్బందికి కత్తిమీద సామువంటిదే.

ట్రంప్ పర్యటన సందర్బంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అటు గుజరాత్ పోలీసుతోపాటు కేంద్ర దళాలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈనెల 24న ట్రంప్ దంపతులు అహ్మదాబాద్ విమానాశ్రయంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి వారిని అనుక్షణం వెన్నంటే ఉంటుంది జాతీయ భద్రతా దళం. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడం దీనిప్రత్యేకత. ట్రంప్ తోపాటు ప్రధాని మోదీసైతం పాల్గొననుండటంతో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, నిఘా, ఇతర భద్రతా దళాలు ఇందులో భాగస్వామ్యం అవుతున్నాయి. ట్రంప్ పర్యటనను క్షుణ్నంగా పరిశీలించేందుకు అమెరికా సీక్రెస్ సర్వీస్ విభాగం అధికారులు ఇప్పటికే భారత్ కు చేరుకున్నారు. ఆయా ప్రాంతాల్లో భద్రతను పరిశీలించి మన అధికారులకు సూచనలు సలహాలు అందిస్తున్నారు.

ట్రంప్ దంపతులు అహ్మదాబాద్ విమానాశ్రయంలో దిగి మోతెరా స్టేడియం వరకు సాగే రోడ్ షోలో దాదాపు 10వేల మంది భద్రతా సిబ్బంది పాల్గొననున్నారు. ప్రముఖుల బందోబస్తులో 25మంది ఐసిఎస్ అధికారులు, 65మంది అసిస్టెంట్ కమిషన్ స్థాయి అధికారులు, 200మంది పోలీస్ ఇన్ స్పెక్టర్లు, 800మంది సబ్ ఇన్ స్పెక్టర్లు, 10వేల మంది పోలీలసు భద్రతలో భాగస్వాములు కానున్నారు. NPG, NSG స్పైపర్ యూనిట్లను కీలకమైన ప్రాంతాల్లో మోహరిస్తారు. బాంబ్ స్క్వాడ్, నిఘా విభాగాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి.

Tags

Read MoreRead Less
Next Story