తాజా వార్తలు

భరత్‌ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జి పైనుంచి కింద పడ్డ కారు

భరత్‌ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జి పైనుంచి కింద పడ్డ కారు
X

హైదరాబాద్‌ భరత్‌ నగర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి బ్రిడ్జి పైనుంచి కింద పడిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు యువకులు ఉన్నారు. మూసాపేట నుంచి సనత్‌నగర్‌ వైపు వెళ్తుండగా ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి బ్రిడ్జి పైనుంచి పడిపోయింది. కారు నుజ్జు నుజ్జు కావడంతో.. ప్రమాద తీవ్రత పెరిగింది. సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వెంటనే క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Next Story

RELATED STORIES