డెడ్‌లైన్‌ తో మొండిపట్టు వీడిన టెల్కో కంపెనీలు

డెడ్‌లైన్‌ తో మొండిపట్టు వీడిన టెల్కో కంపెనీలు

టెలికం సంస్థలు దిగొచ్చాయి. సుప్రీంకోర్టు ఆగ్రహం, కేంద్ర ప్రభుత్వ డెడ్‌లైన్‌ నేపథ్యంలో టెల్కో కంపెనీలు మొండిపట్టు వీడాయి. ప్రభుత్వానికి బకాయి పడిన మొత్తాన్ని చెల్లించడానికి అంగీకరించా యి. టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ 10 వేల కోట్ల రూపాయలను టెలికంశాఖకు చెల్లించింది. భారతి ఎయిర్‌టెల్‌, భారతి హెక్సాకామ్‌, టెలినార్‌ల తరపున 10 వేల కోట్లు చెల్లించామని కంపెనీ ప్రతినిధు లు తెలిపారు. మిగిలిన మొత్తాన్ని కూడా త్వరలోనే చెల్లిస్తామని, ఎంత చెల్లించాలనే అంశంపై మదింపు చేస్తున్నామని వెల్లడించారు. సుప్రీంకోర్టు తదుపరి విచారణలోపు మిగిలిన బకాయిలను పే చేస్తామ ని వివరించారు. వొడాఫోన్ ఐడియా కంపెనీ మాత్రం ఇంకా మెట్టు దిగలేదు. ఇవాళ 2 వేల 500 కోట్లు చెలిస్తామని, శుక్రవారం మరో వెయ్యి కోట్లు కడతామని ప్రతిపాదించింది. ఇందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు. బ్యాంకు గ్యారెంటీలను కూడా నమ్మే పరిస్థితి లేదని కోర్టు స్పష్టం చేసింది.

భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సహా పలు టెలికం కంపెనీలు కేంద్రానికి భారీగా బకాయి పడ్డాయి. దాదాపు లక్ష 50 వేల కోట్ల రూపాయల మేర బాకీ ఉన్నాయి. ఇందులో లైసెన్స్‌ ఫీజు, స్పెక్ట్రం వాడకం చార్జీలు సహా వివిధ రకాల బకాయిలు ఉన్నాయి. ఎయిర్‌టెల్ కంపెనీ ఒక్కటే 35 వేల 586 కోట్లు బాకీ పడింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బకాయిలు మొత్తం 90 రోజుల్లో చెల్లించాల‌ని 2019 అక్టోబ‌ర్‌లో ఆదేశాలు ఇచ్చింది. జ‌న‌వ‌రి 24వ తేదీతో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసింది. ఐతే, టెలికం కంపెనీలు బాకీ డ‌బ్బులు చెల్లించ‌లేదు. దీంతో కోర్టు సీరియ‌స్ అయ్యింది. సొమ్ము కట్టకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఐనప్పటికీ టెలికం కంపెనీలు పట్టించుకోలేదు. పైగా, టెలికం శాఖ ద్వారా వ్యవహారాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. బాకీల వి షయంలో టెలికం కంపెనీలపై ఒత్తిడి తేవొద్దని టెలికాంశాఖ డెస్క్‌ అధికారి ఆదేశాలు జారీ చేశారు. ఇది సుప్రీంకోర్టుకు మరింత ఆగ్రహం తెప్పించింది. టెల్కోల నుంచి డ‌బ్బులు వ‌సూల్ చేయ‌రాదని ఓ అధికారి ఎలా ఆదేశాలు ఇస్తార‌ని కోర్టు ప్రశ్నించింది.

టెల్కోల తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. భార‌తీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, MTNL, BSNL, రిల‌య‌న్స్ కమ్యూనికేష‌న్స్‌, టాటా టెలిక‌మ్యూనికేష‌న్స్ సంస్థల‌కు స‌మ‌న్లు జారీ చేసింది. ఆయా కంపెనీలు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డాయని కోర్టు స్పష్టం చేసింది. మార్చి 17న ఆ కంపెనీల డైరెక్టర్లు తమ ముందు ప్రత్యక్ష్యంగా హాజరుకావాలని ఆదేశించింది. గత ఆదేశాలను ఉల్లంఘించినందుకు గాను కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోవద్దో వివరణ ఇవ్వాలని సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కేంద్రం కూడా రం గంలోకి దిగింది. వెంటనే 92 వేల కోట్లు కట్టాలని ఆదేశించింది. దాంతో ఎయిర్‌టెల్ కంపెనీ తొలి విడతగా 10 వేల కోట్లు చెల్లించింది.

టెలికం శాఖ లెక్కల ప్రకారం 15 సంస్థలు కేంద్రానికి లక్ష 47 వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో టెలికం కంపెనీల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. వొడా ఫోన్ ఐడియా పరిస్థితి అగమ్యగోచరంగా మారే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే దేశంలోని టెలికం రంగంలో రెండు కంపెనీల ఆధిపత్యమే ఉంటుందని చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story