అతిపెద్ద అయిద‌వ ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా భార‌త్

అతిపెద్ద అయిద‌వ ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా భార‌త్

అయిద‌వ అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా భార‌త్ ఆవిర్భ‌వించింది. ఈ క్ర‌మంలో బ్రిట‌న్‌, ఫ్రాన్స్ దేశాల‌ను భార‌త్ దాటేసింది. అమెరికాకు చెందిన వ‌ర‌ల్డ్ పాపులేష‌న్ రివ్యూ సంస్థ ఈ విష‌యాన్ని చెప్పింది. ఓపెన్ మార్కెట్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా భార‌త్ ప‌రిణితి చెందుతున్న‌ద‌ని ఆ సంస్థ త‌న నివేదిక‌లో వెల్ల‌డించింది. ఇండియా జీడీపీ 10.51 ట్రిలియ‌న్ల డాల‌ర్లుగా ఉన్న‌ట్లు పేర్కొన్న‌ది. జీడీపీలో జ‌పాన్‌, జ‌ర్మ‌నీ దేశాల‌ను దాటేసిన‌ట్లు వెల్ల‌డించింది. భార‌త్‌లో అధిక జ‌నాభా ఉన్న కార‌ణంగా.. జీడీపీ త‌ల‌స‌రి ఆదాయం 2వేల డాల‌ర్లు ఉన్న‌ట్లు పేర్కొన్న‌ది. అయితే జీడీపీ వృద్ధి రేటు మాత్రం 7.5 నుంచి 5 శాతానికి వ‌రుస‌గా మూడో ఏడాది ప‌డిపోయిన‌ట్లు రిపోర్ట్ చెప్పింది.

Tags

Read MoreRead Less
Next Story