Top

ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మార్చేస్తా.. : సీఎం జగన్‌

ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మార్చేస్తా.. : సీఎం జగన్‌
X

ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మార్చేస్తామని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. కర్నూలులో మూడో విడత కంటివెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఇప్పటివరకు 66 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించామని.. 4 లక్షల 36 వేల మంది పిల్లలకు ఉచితంగా కళ్ల జోళ్లు ఇచ్చామని తెలిపారు. వేసవిలో విద్యార్థులకు కంటి చికిత్సలు నిర్వహిస్తామన్నారు.

అవ్వాతాతలకు ఎంత చేసినా తక్కువేనన్నారు సీఎం జగన్. ఆసుపత్రుల రూపురేఖలు మార్చేందుకు నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా మారుస్తానని అన్నారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిని పీహెచ్‌ ప్రమాణాలకు తీసుకొస్తామన్నారు.

గ్రామాల్లోని ఆసుపత్రులు మొదలు.. బోధనాసుపత్రుల వరకు మూడు దశల్లో నాడు-నేడు కార్యక్రమాన్ని చేపడతామన్నారు. రూ.15 వేల కోట్లతో ఆసుపత్రుల రూపురేఖలు మార్చేస్తామన్నారు. అంతేకాదు, రూ.7 వందల కోట్లతో ఏరియా ఆసుపత్రులను తీర్చిదిద్దుతామని తెలిపారు. కొత్తగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో బోధనాసుపత్రి ఏర్పాటు చేస్తామని అన్నారు జగన్.

Next Story

RELATED STORIES