భారీ అంచనాలతో వస్తోన్న భీష్ముడు

భారీ అంచనాలతో వస్తోన్న భీష్ముడు
X

యంగ్ స్టార్ నితిన్, క్రేజీ బ్యూటీ రష్మిక మందన్నా జంటగా నటించిన భీష్మ ఈ నెల 21న విడుదల కాబోతోంది. టైటిల్ అనౌన్స్ అయినప్పటి నుంచే ఈ సినిమాపై పూర్తిగా పాజటివ్ బజ్ ఉంది. టీజర్, సాంగ్స్ తో ఒక్కసారిగా అంచనాలు పెంచింది టీమ్. ఇక లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ తో ఇది నితిన్ కు భారీ హిట్ గా నిలవడం ఖాయం అనిపించింది. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. ఈ బ్యానర్ లో సినిమా అంటే హిట్ గ్యారెంటీ అనే ట్యాగ్ ఎలానూ ఉంది. ఆ ట్యాగ్ కు ఈ పెరిగిన అంచనాలు కూడా తోడవడంతో భీష్మ భారీ విజయం సాధించబోతోంది అని చెప్పకనే చెబుతున్నాయి.

నితిన్, రష్మికల జోడీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. అలాగే మహతి స్వరసాగర్ సంగీతం ఊహించిన దానికన్నా బావుండటంతో పాటు ట్రైలర్ చూసిన తర్వాత ఆర్ఆర్ కూడా అదిరిపోయిందనిపిస్తోంది. రొటీన్ ప్రేమకథలా కాకుండా ఇప్పుడు సొసైటీలో ఉన్న కాంటెంపరరీ ఇష్యూస్ లో ఒకటైన ఆర్గానిక్ ఫామ్ ప్రాధాన్యతను కూడా చర్చిస్తూ సాగే కథ ఖచ్చితంగా వైవిధ్యమైన ఫీలింగ్ ఇస్తుంది అనే నమ్మకంతో ఉంది టీమ్.

సెక్సీ బ్యూటీ హెబ్బా పటేల్ ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. తన పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అవుతుందంటున్నారు. ఇక దర్శకుడి కామిక్ రైటప్ గురించి ఫస్ట్ మూవీకే తెలిసిపోయింది. అది మరోసారి డబుల్ జోష్ గా రాబోతోందని తెలుస్తోంది. కథలో భాగంగా సాగే కామెడీ సినిమాకు హైలెట్ అవుతుందంటున్నారు. వెన్నెల కిశోర్ కామెడీతో పాటు కన్నడ సీనియర్ యాక్టర్ అనంతనాగ్ పాత్ర ఆకట్టుకుంటున్నాయంటున్నారు. మొత్తంగా భీష్మపై భారీ అంచనాలున్నాయి. వాటికి ఏ మాత్రం తగ్గదు అనేలా సినిమాపై పూర్తిగా పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. మరి ఈ భీష్ముడు ఏ రేంజ్ విజయం అందుకుంటాడో చూడాలి.

Next Story

RELATED STORIES