తాజా వార్తలు

ఈ బడ్జెట్‌లో తెలంగాణకు 10% ఎక్కువ నిధులు కేటాయించాం: పీయుష్ గోయల్

ఈ బడ్జెట్‌లో తెలంగాణకు 10% ఎక్కువ నిధులు కేటాయించాం: పీయుష్ గోయల్
X

కేంద్రం ఇచ్చిన నిధుల సంగతి టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం మరిచిపోయినట్టు ఉందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌ ఆరోపించారు. దక్షిణాధి రాష్ట్రాలను కేంద్రం చిన్న చూపుచూస్తోందని మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ప్రధాని మోదీకి దేశం అంతా ఒకటే అని పియూష్‌ వెల్లడించారు. తెలంగాణకు ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చిన నిధుల లెక్కలు పూర్తిగా తన దగ్గర ఉన్నాయన్నారు. లెక్కలు చేతిలో పెట్టుకొనే వచ్చాను అన్నారు. ఈ బడ్జెట్‌లో తెలంగాణకు పది శాతం ఎక్కువగా నిధులు కేటాయించామన్నారు. కేంద్రం నిధులు విడుదల చేయని కారణంగా తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా ఆగలేదని.. ఈ విషయాన్ని తాను ఛాలెంజ్‌ చేసి చెప్పగలను అన్నారు.

Next Story

RELATED STORIES