ఢిల్లీలో నిన్న తొలిసారి సమావేశం అయోధ్య ట్రస్టు

ఢిల్లీలో నిన్న తొలిసారి సమావేశం అయోధ్య ట్రస్టు

దశాబ్దాలుగా కొనసాగిన కోర్టు కేసులు, ఎన్నో ఎళ్ల ఎదురుచూపుల తర్వాత ఆయోధ్యలో రామ మందిర నిర్మాణంలో మరో అడుగు పడింది. ఆలయ నిర్మాణం కోసం కేంద్రం ఏర్పాటు చేసిన అయోధ్య రామజన్మభూమి ఆలయ నిర్మాణ ట్రస్టు ఢిల్లీలో తొలిసారి సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో ఈ సమావేశంలో ట్రస్టు సభ్యులు కొత్త అధ్యక్షుడితో పాటు కార్యదర్శి, కోశాధికారిని ఎన్నుకున్నారు.

ట్రస్ట్ అధ్యక్షుడిగా మహంత్ నృత్య గోపాల్ దాస్ ను, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా చంపత్ రాయ్ , కోశాధికారిగా గోవింద్ గిరిని ట్రస్ట్ సభ్యులు ఎన్నుకున్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన నిర్మాణ సమితికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఐఏఎస్ అధికారి నృపేంద్ర మిశ్రా నేతృత్వం వహించనున్నారు. 15 రోజుల తర్వాత అయోధ్యలో మరోసారి సమావేశమై ఆలయ నిర్మాణ ప్రారంభోత్సవానికి సంబంధించి తేదీని ప్రకటించనున్నారు.

ఇక ఆలయ నిర్మాణం కోసం అవసరమైన విరాళాలపై తొలి సమావేశంలో చర్చించారు. విరాళాల సేకరణ, ఖర్చు విషయంలో ప్రజల నుంచి విమర్శలు తలెత్తకుండా అంతా పారదర్శకంగా ఉండేలా ఎలాంటి పద్దతులు అవలంభించాలనేది ట్రస్ట్ సభ్యులు తమ అభిప్రాయాలు వినిపించారు. అనంతరం అయోధ్యలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ప్రారంభించడానికి ఈ సమావేశంలో నిర్ణయించినట్లు అధ్యక్షుడు నృత్యగోపాల్‌ దాస్‌ చెప్పారు.

అయితే..ఇన్నాళ్ల తర్వాత రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం అవటం స్వాగతించ పరిణామమని కాంగ్రెస్ అంటోంది. అయితే..రాజకీయం చేయకుండా ఆలయ నిర్మాణాన్ని చేపట్టాలని కోరుతోంది.

రామ జన్మభూమి ఆయోధ్యలో ఆలయ పనులకు సంబంధించి ట్రస్ట్ తొలిసారి సమావేశం కావటంపై హర్షం వ్యక్తం అవుతోంది. కాలయాపన చేయకుండా గుడి నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story