ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు

X
TV5 Telugu20 Feb 2020 6:53 PM GMT
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయవాదం అన్న పదాన్ని వాడటం మానుకోవాలని మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. జాతీయవాదం అన్న పదం హిట్లర్ నాజీయిజాన్ని గుర్తు చేస్తుందని హెచ్చరించారు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని ముఖర్జీ యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమంలో మోహన్ భగవత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రష్యాలో RSS కార్యకర్తతో జరిగిన సంభాషణను ఆయన గుర్తు చేసుకున్నారు. జాతీయవాదం పదాన్ని ఉపయోగించే బదులు దేశం లేదా జాతీయత అనే పదాలను ఉపయోగించాలని సూచించారు.
Next Story