కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మహాశివరాత్రి పర్వదిన వేడుకలు

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మహాశివరాత్రి పర్వదిన వేడుకలు

ఆసేతు హిమాచలం పరమేశ్వరుని సేవలో తరిస్తోంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మహాశివరాత్రి పర్వదిన వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరి ఆదిదేవుడికి పూజలు చేస్తున్నారు. ప్రత్యేక అభిషేకాలు, అర్చనలతో నీలకంఠుడిని సేవిస్తున్నారు. ఓం నమ:శివాయ మం త్రోచ్ఛారణతో త్రినేత్రుడి కరుణాకటాక్షాల కోసం ప్రార్థిస్తున్నారు. భక్తజనుల తాకిడితో శైవాలయాలు కిక్కిరిసిపోయాయి.

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దేవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. విద్యుత్ ధగధగలతో శైవక్షేత్రాలు మెరిసిపోతున్నాయి. భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వారణాసిలోని కాశీ విశ్వనాథున్ని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వరాలయంలో ఆదిదేవుడికి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భస్మ హారతిని చూడడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శిం చుకొని తీర్ధప్రసాదాలు అందుకున్నారు.

పంజాబ్‌-అమృత్‌సర్‌లోని శివాలయ బాగ్‌ భయాన్ ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. దేవదేవున్ని దర్శించుకొని బోలాశంకరునికి మొక్కులు సమర్పించుకున్నారు. ఢిల్లీ చాందినీ చౌక్‌లోని గౌరీ శంకర్ ఆలయం, కర్ణాటకలోని కలబురగిలో స్థానికంగా లభించే గింజలతో 25 అడుగుల ఎత్తు శివలింగాన్ని రూపొందించారు. ముంబైలోని బాబుల్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహిం చారు.

Tags

Read MoreRead Less
Next Story