రైతులు కట్టుకథలు చెబుతున్నారు: డీఎస్పీ శ్రీనివాసరెడ్డి

రైతులు కట్టుకథలు చెబుతున్నారు: డీఎస్పీ శ్రీనివాసరెడ్డి

అమరావతి రాజధాని గ్రామాల్లో ఉద్యమం చేస్తున్న రైతులు.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించినప్పుడే తాము యాక్షన్‌ తీసుకుంటున్నామని తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం మందడంలో డ్రోన్‌ కెమెరాను ఇళ్లపైన తిప్పలేదని చెప్పుకొచ్చారు. రోడ్డుపై కూర్చున్నవారిని మాత్రమే చిత్రీకరించామని తెలిపారు. ఓ మహిళ స్నానం చేస్తుండగా డ్రోన్‌తో చిత్రీకరించారని కట్టుకథ అల్లిన రైతులు.. కానిస్టేబుల్‌ని కొట్టి.. డ్రోన్‌ తీసుకెళ్లారని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి అన్నారు.

రాజధాని గ్రామాల్లోకి వచ్చిన తహశీల్దార్ మల్లీశ్వరిని రోడ్డుపై నిర్బంధం చేసినందుకు రైతులపై కేసు పెట్టామని డీఎస్పీ చెప్పారు. ఎమ్మెల్యే రోజాను అడ్డుకున్నందుకు కేసులు నమోదు చేశాం అన్నారాయన. డీజీపీ, హోం మంత్రి కాన్వాయ్‌ వెళ్తుండగా రైతులు ట్రాక్టర్ అడ్డుపెట్టారని.. కేసులు పెట్టామని తెలిపారు. మరోవైపు.. జేఏసీ నాయకులు శ్రీనివాస్‌, సుధాకర్‌పై మందడంలో దాడి చేయలేదని.. వాళ్లు అబద్ధాలు చెప్తున్నారని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story