Top

'హునర్‌ హాట్‌' మేళాను సందర్శించిన ఉపరాష్ట్రపతి

హునర్‌ హాట్‌ మేళాను సందర్శించిన ఉపరాష్ట్రపతి
X

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మేళాలో సందడి చేశారు. ఢిల్లీలో జరుగుతున్న హూనర్ హాట్ మేళాకు వెంకయ్యనాయుడు వెళ్లారు. అక్కడి దుకాణదారులతో కాసేపు ముచ్చటించారు. స్టాల్స్ తిరుగుతూ అక్కడి వస్తువులు, కళా ప్రదర్శనల గురించి అడిగి తెలుసుకున్నారు. వెంకయ్యనాయుడి వెంట కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ కూడా ఉన్నారు.

ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో హూనర్ హాట్ మేళా జరుగుతోంది. స్థానికంగా ఈ మేళా చాలా ప్రాచుర్యం పొందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మేళాకు వెళ్లారు. మోదీ వచ్చి వెళ్లిన మరుసటి రోజే ఉపరాష్ట్రపతి కూడా వచ్చారు. మేళాను సందర్శించడంతో పాటు అక్కడే టీ, స్నాక్స్ తీసుకున్నారు. ప్రభుత్వ పెద్దలు ఒక్కొక్కరే వస్తుండడంతో మేళాకు ప్రాచుర్యం మరింత పెరిగింది.

Next Story

RELATED STORIES