అయోధ్య రామాలయ నిర్మాణానికి ప్రధాని మోదీకి ఆహ్వానం

అయోధ్య రామాలయ నిర్మాణానికి ప్రధాని మోదీకి ఆహ్వానం

అయోధ్య రామాలయ నిర్మాణానికి ప్రధాని మోదీకి ఆహ్వానం వచ్చింది. రామమందిర నిర్మాణానికి సంబంధించి భూమిపూజకు రావాలని రామమందిరం ట్రస్ట్‌ మోదీని కోరింది. ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్‌ నేతృత్వంలో సభ్యులంతా ప్రధాని నివాసానికి వెళ్లారు. రామాలయ నిర్మాణం, భూమిపూజపై ప్రధానితో చర్చించారు. రామమందిర నిర్మాణ శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించారు. ట్రస్ట్ ఆహ్వానంపై మోదీ సానుకూలంగా స్పందించారు. నిర్ణీత గడువులోపు టెంపుల్ నిర్మాణం పూర్తయ్యేలా చూసుకోవాలని సూచించారు. శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ అధ్యక్ష, కార్యదర్శులను ఇటీవల ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా చంపత్ రాయ్, కోశాధికారిగా గోవింద్ దేవ్ గిరి తదితరులు ట్రస్టులో సభ్యులుగా ఉన్నారు.

ఇదిలా ఉంటే, రామాలయ నిర్మాణం గడువుపై శివసేన తీవ్రంగా స్పందించింది. రామమందిర నిర్మాణాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకోవద్దని బీజేపీని హెచ్చరించింది. 2024 నాటికి రామాలయ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. రెండూ ఒకే ఏడాది వస్తుండడంతో శివసేన ఘాటుగా రియాక్టైంది. రామమందిరం ట్రస్టు బోర్డు సభ్యులంతా ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితులని శివసేన పేర్కొంది. సభ్యులందరూ RSS, విహెచ్‌పీలకు చెందినవారే అని ఆరోపించింది. 2024లోనే రామాలయం నిర్మితమైతే దాని నుంచి బీజేపీ లబ్ది పొందుతుందని అనుమానం వ్యక్తం చేసింది. శ్రీరామున్ని కూడా ఎన్నికల ప్రచారానికి వాడుకుంటారని విమర్శించింది. రామాలయం కోసం చాలామంది శివసైనికులు ప్రాణత్యాగం చేసిన విషయం మరిచి పోవద్దని సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story