చండీగఢ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు విద్యార్థినులు సజీవ దహనం

చండీగఢ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు విద్యార్థినులు సజీవ దహనం

చండీగఢ్‌లో భారీ అగ్ని ప్రమాదంలో ముగ్గురు విద్యార్థినులు సజీవ దహనమయ్యారు. సెక్టార్ 32 దగ్గర ఉన్న పీజీ వసతి గృహంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు విద్యార్థినులు అక్కడే సజీవ దహనమయ్యారు. ల్యాప్‌టాప్‌ చార్జ్‌ చేస్తుండగా మంటలంటుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ భవనంలో కనీస భద్రతా చర్యలేవీ తీసుకో లేదనీ, అనేక అగ్నిమాపక భద్రతా ఉల్లంఘనలు జరిగినట్టు అగ్నిమాపక అధికారులు చెపుతున్నారు.

సెక్టార్ 32 లోని పీజీ వసతి గృహంలో మంటలు చెలరేగడంతో ముగ్గురు యువతులు మృతి చెందినట్లు ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి అధికారులు ప్రకటించారు. భవనంపై అంతస్తులో అక్రమ నిర్మాణం జరిగినట్టుగా గుర్తించామన్నారు. భవనం మొదటి అంతస్తులో మరణించిన విద్యార్థినులు పేయింగ్‌ గెస్ట్‌లుగా వుంటున్నారని చండీగఢ్‌ పోలీసు సూపరింటెండెంట్ వినీత్ కుమార్ తెలిపారు. 19-22 సంవత్సరాల వయస్సు వీరిని పంజాబ్‌, హర్యానాకు చెందిన ముస్కాన్, రియా, ప్రాక్షిగా గుర్తించారు. మరో విద్యార్థిని భవనం పైనుంచి కిందికి దూకేయడంతో తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. మొత్తం 36 మంది విద్యార్థులు ఈ భవనంలో ఉన్నట్టు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story