రోజులు గడుస్తున్నా స్పందన కరువు.. అయినా పోరాటాన్ని ఆపం : రైతులు

రోజులు గడుస్తున్నా స్పందన కరువు.. అయినా పోరాటాన్ని ఆపం : రైతులు

రోజులు గడుస్తున్నాయి.. అటు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. అయినా తమ పోరాటాన్ని మాత్రం ఆపడం లేదు రైతులు. ఉద్యమ బాటను వీడడం లేదు. ప్రభుత్వం దిగొచ్చే వరకు తమ పోరాటాన్ని శాంతియుతంగా కొనసాగిస్తామని చెబుతున్నారు. రాజధాని అమరావతి కోసం ముక్తకంఠంతో నినదిస్తున్నారు. రైతులు చేపట్టిన ఆందోళనలు నేటికి 68వ రోజుకు చేరుకున్నాయి. 29 గ్రామాల్లో నిరసనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి.

తుళ్లూరు, మందడం, పెనుమాక, యర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడితో పాటు నేలపాడు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డులో 68వ రోజు కూడా రైతులు ధర్నాలు, దీక్షలు చేపట్టారు. జై అమరావతి నినాదాలతో దీక్షా శిబిరాలు మారుమోగుతున్నాయి. అమరావతికి మద్దతుగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ఆందోళనలు జరుగుతున్నాయి.

67 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని రైతులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదని.. రాష్ట్రంలో చలనం లేని రాయిలా ప్రభుత్వ పాలన ఉందని మండిపడుతున్నారు. అమరావతి నుంచి రాజధాని మారిస్తే జగన్‌ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని అంటున్నారు. ఇప్పటికే అమరావతి బంద్‌ విజయవంతం కావడంతో... ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని రైతులు, జేఏసీ నేతలు భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story