మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ

మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ
X

మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోలు ప్రాణాలు కోల్పోయారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 8 మంది నక్సల్స్ మృతి చెందారు. మరికొందరు గాయపడగా, మిగిలినవారు పారిపోయారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సుక్మా జిల్లాలో మావోయిస్టుల ఏరివేతకు భద్రత బలగాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. నక్సల్స్ టార్గెట్‌గా ఆపరేషన్ ప్రహార్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా తొండమార్కా, దుర్మా, బడేకదేవాల్‌ తదితర ప్రాంతాల్లో ముమ్మరంగా కూంబింగ్ నిర్వహించారు. మావోలు ఉన్నారనే సమాచారంతో అడవిని జల్లెడ పట్టారు. దాదాపు 30 గంటల పాటు ఆపరేషన్ ప్రహార్ జరిగింది. ఈ క్రమంలో మావోలు, భద్రతా బలగాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది.

Next Story

RELATED STORIES