రవితేజ క్రాక్ కూడా ఖతమేనా..?

రవితేజ క్రాక్ కూడా ఖతమేనా..?
X

ఒకప్పుడు మాస్ మహరాజ్ గా మినిమం గ్యారెంటీ హీరో అనిపించుకున్న రవితేజ.. ప్రస్తుతం మాగ్జిమం లాస్ హీరో అనిపించుకుంటున్నాడు. ఈ మధ్య కాలంలో అతను సినిమా చేయడమే ఆలస్యం ఫ్లాప్ అన్నట్టుగా మారింది పరిస్థితి. అందుకు కారణం.. ఏ మాత్రం కొత్తదనం లేని కథ, కథనాలే. పైగా వీటిలో ఎప్పుడో దశాబ్ధం క్రితం నాటి తన డిక్షన్ నే వాడుతున్నాడు. తను అనుకుంటోన్న మాస్ అర్థం ఇప్పుడు మారిపోయింది. అందుకే స్టార్ హీరోలంతా మరోవైపుగా ప్రయత్నాలు చేస్తున్నారని రవితేజకు అర్థమైనట్టు లేదు. అతని లేటెస్ట్ మూవీ క్రాక్ లోకూడా ఇదే తరహాలో కనిపించబోతున్నాడు.

గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న క్రాక్ లో మరోసారి పోలీస్ గా కనిపించబోతున్నాడు రవితేజ. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ విడుదల చేశారు. కానీ ఏ మాత్రం కొత్తదనం లేదు. కొన్ని తమిళ్ సినిమాల నుంచి కట్ చేసినట్టుగా ఉన్నాయి టీజర్ షాట్స్. ఒంగోలు బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ సినిమాలోనూ రవితేజ అవే మూస డైలాగులతో కనిపిస్తున్నాడు. అయితే ఈ టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ చెబుతోన్న మాట డౌటూ ఒకటే. మే 8న విడుదల కానున్న ఈ సినిమా టీజర్ ను ఇప్పుడెందుకు వదిలారా అని. అంటే విడుదలకు ఇంకా రెండు నెలలుంది. అయినా ఇంత ఆత్రం దేనికీ అనేదే డౌట్. ఆ డౌట్ కు కారణం రవితేజ మార్కెట్టే.

ఎలా చూసినా రవితేజ మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయింది. రీసెంట్ గా కొన్ని అంచనాలతో వచ్చిన డిస్కోరాజా కూడా డిజాస్టర్ కావడంతో ఈ మూవీపై డిస్ట్రిబ్యూటర్స్ ఎవరూ ఇంట్రెస్ట్ గా లేరు. బయ్యర్స్ అసలు రవితేజ సినిమా అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. దీంతో సినిమాలో మేటర్ ఉంది చూడండి.. అంటూ వారికి చెప్పేందుకే ఈ టీజర్ వదిలారని సులువుగా ఊహించొచ్చు. బట్.. వారి కోరిక నెరవేర్చేలా లేదీ టీజర్. అయినా ఈ సినిమాపై ఎవరికీ పెద్దగా ఇంట్రెస్ట్ లేదని బిజినెస్ సర్కిల్స్ లో వినిపిస్తోన్న మాట. ఒకవేళ ఎవరైనా కొన్నా.. చాలా లీస్ట్ ప్రైస్ మాత్రమే కోట్ చేసేలా ఉన్నారట. అందుకు ఒప్పుకుంటే తప్ప క్రాక్ బయటకు రాదు. లేదంటే ఇది కూడా ఖతమైపోక తప్పదు అంటున్నారు. మరి ఈ ఫ్లాపుల దొంతర నుంచి రవితేజను కాపాడేది ఎవరో..?

Next Story

RELATED STORIES