గర్ల్స్‌ హాస్టల్‌లో యువకుడు.. సెక్యూరిటీకి అడ్డంగా దొరికిపోయిన విద్యార్థిని

గర్ల్స్‌ హాస్టల్‌లో యువకుడు.. సెక్యూరిటీకి అడ్డంగా దొరికిపోయిన విద్యార్థిని

బుద్ధిగా చదువుకుని తమ పేరు నిలబెట్టమని కాలేజీలో చేర్పించిన పేరెంట్స్‌కు ఘోరంగా తలవంపులు తెచ్చింది ఓ అమ్మాయి. మరీ దారుణంగా బరితెగించి తన బాయ్ ఫ్రెండ్‌ను ఏకంగా హాస్టల్‌ రూమ్‌కి పిలిపించుకుంది. రూమ్‌ బయటి నుంచి లాక్ చేయడంతో.. ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. ఈ ఘటన.. కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో జరిగింది.

ఓ యువకుడు హాస్టల్‌లోకి వచ్చాడని విషయం తెలుసుకున్న సెక్యూరిటీ సిబ్బంది రూమ్‌ తాళం పగలగొట్టి లోపలికి వెళ్లారు. రూమ్‌ అంతా గాలించి.. బెడ్‌ కింద దాక్కున్న యువకుడిని చూసి షాక్ అయ్యారు. వాళ్లిద్దరినీ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. యువకుడు ఓ రోజంతా హాస్టల్‌లో ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనలో ట్రిపుల్‌ ఐటీ మేనేజ్‌మెంట్‌ ఆరుగురు విద్యార్థినులను.. సస్పెండ్‌ చేసింది. అత్యంత టైట్‌ సెక్యూరిటీ ఉన్నట్టుగా కనిపించే హాస్టల్‌ వద్ద... భద్రతా లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story