అహ్మదాబాద్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్

అహ్మదాబాద్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ చేరుకున్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ట్రంప్ కుటుంబసమేతంగా విచ్చేశారు. ట్రంప్‌కి ప్రధాని మోదీ, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఘనస్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టులో సాంప్రదాయ పద్దతితో ట్రంప్ కు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి ఇద్దరూ నేరుగా సబర్మతీ ఆశ్రమానికి బయల్దేరారు. అక్కడ దాదాపు 15 నిమిషాలపాటు గడుపుతారు. తర్వాత మెతేరా క్రికెట్‌ స్టేడియం ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఇద్దరి ప్రసంగం ఉంటుంది. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నేతలు, ప్రముఖ పారిశ్రామివేత్తలు, క్రికెటర్లు, బాలీవుడ్ స్టార్లు హాజరయ్యారు.

ట్రంప్ వెల్కమ్ సెరమనీ పూర్తిగా భారతీయ సంప్రదాయ పద్ధతిలో జరిగింది. ముందుగా త్రివిధ దళాలు ట్రంప్ దంపతులకు గౌరవవందనం సమర్పించాయి. అనంతరం, గుజరాతీ సంప్రదాయ నృత్యా లతో ట్రంప్ బృందానికి ఆహ్వానం పలికారు. ట్రంప్ దంపతులు, ప్రధాని మోదీ రెడ్ కార్పెట్‌పై నడుచుకుంటూ సంప్రదాయ నృత్యాలను తిలకించారు.

అమెరికా అధ్యక్షుడి విమానం ఎయిర్‌ఫోన్స్ వన్‌లోనే ట్రంప్‌ భారత్‌కు వచ్చారు. విమానం నుంచి ముందుగా ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ దిగారు. గుజరాత్ సీఎం, కేంద్రమంత్రులతో కాసేపు ముచ్చటించారు.

Tags

Read MoreRead Less
Next Story