మలేసియా ప్రధాని సంచలన నిర్ణయం!

మలేసియా ప్రధాని సంచలన నిర్ణయం!
X

మలేసియాలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ప్రస్తుత ప్రధాని మహతీర్ మొహమాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేసి దేశ ప్రజలను షాక్ కు గురిచేశారు. తన రాజీనామాను మలేసియా రాజుకు సమర్పించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఇక 2018 మేలో మలేసియా ప్రధాని బాధ్యతలు చేపట్టిన మహతీర్ మహ్మద్.. ప్రపంచంలో అత్యధిక వయసున్న ప్రధానిగా రికార్డులోకెక్కారు. ప్రధానమంత్రికి మద్దతుగా పాలక సంకీర్ణ పకటాన్ హరపాన్ నుంచి తప్పుకుంటున్నట్లు మహతీర్ పార్టీ మలేషియా యునైటెడ్ ఇండిజీనస్ పార్టీ (బెర్సాటు) సోమవారం ప్రకటించింది.

Tags

Next Story