Top

మూడు కాకపోతే ముప్పై రాజధానులు పెట్టుకోమనండి : తమ్మారెడ్డి భరద్వాజ్‌

మూడు కాకపోతే ముప్పై రాజధానులు పెట్టుకోమనండి : తమ్మారెడ్డి భరద్వాజ్‌
X

మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వ తీరును సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్‌ తప్పు పట్టారు. మూడు కాకపోతే ముప్పై రాజధానులు పెట్టుకోమనండి అంటూ మండిపడ్డారు. ఎక్కడ నుంచి పాలన జరుగుతుందో అదే రాజధాని అవుతుందన్నారు. ప్రజల సొమ్ముతో అమరావతి కోసం ఆరు, ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టారని.. మరో రెండు వేల కోట్లు ఖర్చుపెడితే రాజధాని రెడీ అయిపోతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు మారినా ప్రజలే ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రజా ప్రతినిధులు బూతులు తిట్టుకుంటున్నారని.. తెలుగువాడు అని చెప్పుకునేందుకే సిగ్గుపడేలా చేస్తున్నారంటూ మండిపడ్డారు.

Next Story

RELATED STORIES