Top

ప్రభుత్వం చేపట్టిన భూసేరణ తీరుతో ప్రాణాలు కోల్పోతున్న పేద రైతులు

ప్రభుత్వం చేపట్టిన భూసేరణ తీరుతో ప్రాణాలు కోల్పోతున్న పేద రైతులు
X

ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యం అబాసుపాలవుతోంది. భూసేకరణ పేరుతో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పెద్దల భూములు వదిలి పేదల భూములకు ఎసరు పెడుతున్నారు. ఉన్న రెండు మూడు ఎకరాలను బలవంతంగా సేకరించుకుని అన్నదాతల కడుపు కోడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న బక్కచిక్కిన రైతులు.. మనోవేదనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

కృష్ణా జిల్లాలో ఇళ్ల స్థలాల పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా పచ్చని పొలాన్ని దున్నేశారు అధికారులు. తహసీల్దార్‌ పొలం దున్నివేయించాడన్న మనస్తాపంతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటన నాగాయలంక మండలం మర్రిపాలెం గ్రామంలో జరిగింది. బాధిత రైతు గుండు పోతురాజును అవనిగడ్డ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని పలువురు గ్రామస్తులు మండిపడుతున్నారు.

కర్నూలు జిల్లాలో అధికారుల తీరుతో మనోవేదనకు గురై మిడుతూరు మండలం రోళ్లపాడుకి చెందిన మహిళా రైతు రాజమ్మ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. నంద్యాల రోడ్డు పక్కన ఉన్న 4 ఎకరాల 20 సెంట్ల భూమిని ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటోంది. ఈ భూమిలో 3 ఎకరాల 50 సెంట్లను అధికారులు బలంవంతంగా లే అవుట్లు వేశారు. తమకు ఈ పొలం తప్ప మరో జీవనాధారం లేదని వేడుకున్నా.. కాళ్లా వేళ్లా పడ్డా కనికరించిలేదు. దీంతో రాజమ్మ మనో వేదనకు గురై గుండెపోటు వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరులో తమ పొలాన్ని రెవెన్యూ శాఖ అధికారులు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఆందోనకు దిగారు రైతులు. పొలంలో పురుగు మందు డబ్బాలతో కూర్చున్నారు. గతంలో ఆర్మీలో పనిచేసిన వారికి అప్పట్లో ప్రభుత్వం ఇచ్చింది. వారి నుంచి భూమిని రైతులు కొనుగోలు చేశారు. అయితే ఇప్పడు ఆ భూమి ప్రభుత్వానికి చెందిందంటూ .. పేదల ఇళ్ల స్థలాలకు ఈ భూమిని కేటాయించామని రెవెన్యూ అధికారులు బోర్డులు పెట్టారు. తమకు జీవనాధారంగా ఉన్న భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారంటూ పొలంలోనే పురుగు మందు డబ్బాలతో రైతులు ఆందోళనకు దిగారు. పేదలకు ఇళ్ల పేరుతో తమ భూములు లాక్కున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

RELATED STORIES