Top

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల
X

ఏప్రిల్‌లో ముగియనున్న రాజ్యసభ సీట్లకు షెడ్యూల్‌ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. మొత్తం 17 రాష్ట్రాల నుంచి 55 మంది రాజ్యసభ సభ్యులు రిటైర్‌ అవుతున్నారు. ఏపీ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఇద్దరు రిటైర్‌ అవుతున్నారు. ఏపీ నుంచి రిటైర్‌ అవుతున్న వారిలో ఎంఏ ఖాన్‌, సుబ్బిరామిరెడ్డి, కే.కేశవరావు, తోట సీతారామలక్ష్మి ఉండగా.. తెలంగాణ నుంచి రిటైర్‌ అవుతున్నవారిలో కేవీపీ రామచంద్రరావు, గరికపాటి మోహన్‌రావులు ఉన్నారు. మార్చి 6న నోటిఫికేషన్‌ రిలీజ్‌ అవుతుంది. నామినేషన్‌కు చివరి తేది మార్చి 13. అవసరమైతే మార్చి 26 పోలింగ్‌ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం కౌటింగ్‌ జరగనుంది.

Next Story

RELATED STORIES