ఢిల్లీ పరిస్థితిని అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన అజిత్ దోవల్

ఢిల్లీ పరిస్థితిని అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన అజిత్ దోవల్

ఢిల్లీలో ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రంగంలో దిగిన అదనపు భద్రతా బలగాలు.. సమస్యాత్మక ప్రాంతాల్లో కవాతు నిర్వహించారు. జఫాబాద్, మౌజ్‌పూర్, బబూర్‌పూర్, కరవాల్ నగర్, చాంద్ బాగ్, గోకుల్‌పురి వంటి ప్రాంతాల్లో.. భారీగా బలగాలను మోహరించారు. ఈ ప్రాంతాల్లో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. హింసను నియంత్రించేందుకు షూట్ ఎట్ సైట్ ఆదేశాలు ఇచ్చారు.

మరోవైపు.. అల్లరి మూకల దాడిలో ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 20కి చేరింది. మరో 200 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అటు.. పరిస్థితిని కంట్రోల్‌ చేసేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్వయంగా రంగంలోకి దిగారు. ఢిల్లీ పరిస్థితిని ప్రధాని మోదీకి వివరించనున్నారు అజిత్‌ ధోవల్.

అటు.. ఢిల్లీ అల్లర్లపై సుప్రీం కోర్టు విచారం వ్యక్తం చేసింది. ఈ అంశంపై దాఖలైన పిటీషన్లపై విచారణకు నిరాకరించింది. ఇప్పటికే ఈ అంశం ఢిల్లీ హైకోర్టు విచారణ జరుపుతోందని.. ఈ మేరకు నోటీసులు కూడా జారీ చేసిందని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకొచ్చారు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని బట్టి పోలీసులు ఎప్పటికప్పుడు సరైన చర్యలు తీసుకుంటామని కోర్టుకు వివరించారు. దీంతో హైకోర్టే దీనిపై విచారణ కొనసాగిస్తుందని వ్యాఖ్యానిస్తూ.. పిటీషన్లను ధర్మాసం కొట్టేసింది.

ఇక పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయమూర్తులు.. పరిస్థితిని అదుపులోకి తేవడంలో సమర్ధంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఘర్షణలు ప్రేరేపించే ప్రకటనలు చేసే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఢిల్లీ పోలీసుల పనితీరును తాము శంకించడం లేదని.. పరిస్థితులను నిలువరించాలన్న ఉద్దేశంతోనే.. ఈ వ్యాఖ్యలు చేసినట్లు అభిప్రాయపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story