తలకిందులుగా తపస్సు చేసినా రాజధాని మారదు : మాజీ మంత్రి సోమిరెడ్డి

తలకిందులుగా తపస్సు చేసినా రాజధాని మారదు : మాజీ మంత్రి సోమిరెడ్డి
X

రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఉద్యమిస్తున్నరైతులకు.. టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి సంఘీభావం తెలిపారు. రాజధాని గ్రామాల్లో పర్యటించి వారి దీక్షలకు మద్దతు తెలిపారు. రైతుల ఒప్పందంతో పెట్టిన రాజధాని అమరావతి అని అన్నారు. తలకిందులుగా తపస్సు చేసినా రాజధాని మారదన్నారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని మారుస్తారా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. ప్రజల మధ్య గొడవలు పెట్టేందుకే రాజధానిలో 12 వందల 50 ఎకరాలు పంపిణీ చేస్తున్నారని అన్నారు. సెంటు స్థలం అంటే.. మంత్రి బొత్స బాత్రూమ్‌ అంత కూడా ఉండదని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు.

Tags

Next Story