అమిత్ షా రాజీనామా చేయాలి : సోనియాగాంధీ

అమిత్ షా రాజీనామా చేయాలి : సోనియాగాంధీ

ఈశాన్య ఢిల్లీలో మూడు రోజుల హింసాకాండ నేపథ్యంలో 20 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.. అయితే దీనికి బాధ్యత వహిస్తూ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో సోనియాగాంధి మాట్లాడుతూ.. ఢిల్లీలో అల్లర్లు బాధాకరం అని.. ఈ పరిణామాలకు కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు. ఇంతలా అల్లర్లు జరుగుతుంటే హోమ్ మంత్రి అమిత్ షా ఎక్కడున్నారని ఆమె ప్రశ్నించారు. అల్లర్లకు నైతిక బాధ్యత వహిస్తూ.. అమిత్ షా తన పదవికి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. ద్వేషపూరిత ప్రసంగాలతో ఢిల్లీలో భయం వాతావరణాన్ని సృష్టించారని సోనియా గాంధీ ఆరోపించారు.

పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి తగిన బలగాలను మోహరించాలి, మొహల్లాస్‌లో శాంతి కమిటీలను ఏర్పాటు చేయాలి అని ఆమె బుధవారం అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన ప్రభుత్వం శాంతిని కాపాడుకోవడంలో విఫలమైందని సోనియా గాంధీ ఆరోపించారు.. ద్వేష రాజకీయాలను తిరస్కరించాలని, చీలికలను దూరం చేయడానికి తమ వంతు కృషి చేయాలని సోనియా గాంధీ పౌరులను కోరారు. ఆమె విలేకరుల సమావేశం జరిగిన కొద్దిసేపటికే, ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీ పరిస్థితులపై "విస్తృతమైన సమీక్ష" నిర్వహించినట్లు ట్వీట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story