అప్పట్లో రాజస్థాన్ లోని దుబిలో కూడా అలాంటి ప్రమాదమే

అప్పట్లో రాజస్థాన్ లోని దుబిలో కూడా అలాంటి ప్రమాదమే

బుధవారం తెల్లవారుజామన ఓ పెళ్లి బస్సు బ్రిడ్జ్ పై నుంచి ఒక్కసారిగా అదుపు తప్పి నదిలో పడిపోయింది. రాజస్థాన్‌ లోని సవాయ్ మాధోపూర్ జిల్లా బూందీ పాపిడి గావ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద విషయం తెలుసుకున్న స్థానికులు.. హుటాహుటిన ఘటనాస్థలానికి పెద్దయెత్తున తరలివచ్చారు. అయితే, అప్పటికే బస్సు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. దీంతో 24 మంది మృత్యువాత పడ్డారు. నీటి ప్రవాహంలో చిక్కుకున్న కొందరు ప్రయాణికులను స్థానికులు కాపాడారు.

కోటా నుంచి సవాయ్‌మాధోపూర్ కు పెళ్లి వేడుక కోసం వరుడి కుటుంబం, బంధువులతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన బస్సులో 40మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వలనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. బస్సు వేగంగా నడపటంతో అదుపు తప్పి ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందన్నట్టు వైద్యులు ప్రకటించారు.

గతంలో రాజస్థాన్ లోని దుబిలో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. 2017 సంవత్సరం డిసెంబర్ లో బస్సు బ్రిడ్జి మీద నుండి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా 24 మంది గాయపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story