చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్‌తో కేటీఆర్ భేటీ

తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖమంత్రి కేటీఆర్.. భారత చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్‌తో సమావేశమయ్యారు. హైదరాబాద్ లో పర్యటిస్తున్న సుబ్రహ్మణ్యన్‌ను మంత్రి ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక రంగంలో తీసుకున్న చర్యలు, పెట్టుబడుల సేకరణ కోసం చేస్తున్న ప్రయత్నాలను మంత్రి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కు వివరించారు. ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, ప్రాధాన్యతలను సుబ్రహ్మణ్యన్ మంత్రికి వివరించారు. వేగంగా అభివృద్ది చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ సుబ్రహ్మణ్యన్ కు తెలిపారు. గతంలో ఐఎస్ బీలో పనిచేసిన సమయంలో కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ తో తనకు మంచి సంబంధం ఉందని ఈ సందర్బంగా కేటీఆర్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com