ఏదయితే జరగకూడదు అనుక్కున్నామో అదే జరిగింది : పంచుమర్తి అనురాధ

ఏదయితే జరగకూడదు అనుక్కున్నామో అదే జరిగింది : పంచుమర్తి అనురాధ
X

విశాఖలో చంద్రబాబు యాత్రను వైసీపీ నేతలు అడ్డుకోవడంపై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అందులో 'ఏది అయితే జరగకూడదు అనుక్కున్నామో అదే ఇవాళ అయింది. శాంతికి మారుపేరు అయిన విశాఖపట్నంలో నేడు పులివెందుల నుంచి గుండాలు తెప్పించి ఇక్కడ విధ్వంసాన్ని సృష్టించేందుకు వైకాపా పన్నిన కుటిల ప్రయత్నం ఇది. మీరు ఎన్ని ఆటలు, కుట్రలు చేసినా అక్కడి ప్రజలకు బాబుగారి విలువ ఏంటో హుదూద్ సమయంలోనే తెలుసు. మీరు ఇప్పుడు వచ్చి ఇక్కడ వెలగపెట్టిన కార్యాన్ని వైజాగ్ ప్రజలు గమనిస్తున్నారు.' అని అనురాధ విమర్శించారు.

Tags

Next Story