అధికార పార్టీలో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే

అధికార పార్టీలో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే

ఉమ్మడి వరంగల్ జిల్లా అధికార పార్టీలో మరోసారి అంతర్గత విభేదాలు వెలుగులోకి వచ్చాయి. ఒకే పార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు. మంత్రి సత్యవతి రాథోడ్ అయితే..ఎమ్మెల్యే శంకర్ నాయక్. మహాబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కన్ఫరెన్స్ హాల్ లో SRSP, చిన్న తరహా నీటి పారుదల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం వివాదానికి కారణమైంది. స్థానిక ఎమ్మెల్యేకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎలా రివ్యూ మీటింగ్ పెడతారని ఎమ్మెల్యే.. మంత్రిని నిలదీశారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

కరీంనగర్ జిల్లా చొప్పదండి కమిషనర్ పై ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నోరు జారారు. తలకాయ ఉందా..యూజ్ లెస్ ఫెలో అంటూ ఆవేశంతో ఊగిపోయాడు. చొప్పదండిలో చేపట్టిన పట్టణ ప్రగతి షెడ్యూల్ ను కమీషనర్ తనకు పంపివ్వటం లేదన్నది ఎమ్మెల్యే ఆరోపణ. రెండ్రోలుగా అసలు ఏం కార్యక్రమాలు చేపట్టారో కూడా చెప్పటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ జేసీ సమక్షంలోనే అధికారిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేయటం వివాదస్పదం అవుతోంది. అంతేకాదు సొంత ఎమ్మెల్యేల నుంచే వ్యతిరేక వాయిస్ వస్తుండటంపై సీరియస్ గానే ఫోకస్ చేస్తోంది ప్రభుత్వం.

Tags

Read MoreRead Less
Next Story