రా ఏజెంట్ అంటూ యువకుడు హల్‌చల్

ఖమ్మం జిల్లాలోని ఓ యువకుడు రా ఏజెంట్‌ని అంటూ కాసేపు హడావుడి చేశాడు. వైరాలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలోకి వెళ్లి హల్‌చల్ చేశాడు. తాను రీసెర్చ్ అనాలససిస్ వింగ్‌కు సంబంధించిన ఏజెంట్ అని కాలేజీలో రహస్య విచారణ జరిపేందుకు వచ్చానని అందర్నీ నమ్మించే ప్రయత్నం చేశాడు. ఒక విద్యార్థినితో రహస్యంగా మాట్లాడాలని.. తనను పంపించాల్సిందిగా కోరాడు.
యువకుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన కాలేజీ ప్రిన్సిపాల్, సిబ్బంది.. అతడిని నిర్బంధించి పోలీసులకు అప్పగించారు. ఆ యువకుడ్ని ముస్తఫానగర్‌కు చెందిన ఉదయ్‌కిరణ్‌గా గుర్తించారు. అతడు సీఏ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణలో భాగంగా కళాశాలకు చెందిన ఓ విద్యార్థినిని ప్రేమిస్తున్నానని.. అమ్మాయితో ఏకాంతంగా మాట్లాడేందుకే కాలేజీకి వచ్చినట్లు యువకుడు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com