73వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

X
TV5 Telugu28 Feb 2020 12:02 PM GMT
ఉద్యమమే ఊపిరిగా అమరావతి రైతుల పోరాటం కొనసాగుతోంది. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు రైతులు. మందడం, తుళ్లూరు, పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, నేలపాడు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలు దగ్గర 73వ రోజు రైతుల దీక్షలు, దర్నాలు కొనసాగుతున్నాయి. దీక్షా శిబిరాల్లో కూర్చుని రాజధాని కోసం నిరంతర పోరాటం చేస్తున్నారు. ఉద్యమాన్ని ఎంత అణచాలని కుట్ర చేసినా.. రైతులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని 72 రోజులుగా నినదిస్తూనే ఉన్నారు. ప్రాణం పోయినా ఉద్యమాన్ని ఆపమంటున్నారు. ఇన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ దమన నీతిని ఎండగడుతున్నారు.
Next Story