శంషాబాద్‌ విమానాశ్రయంపై పడిన కోరోనా ప్రభావం

శంషాబాద్‌ విమానాశ్రయంపై పడిన కోరోనా ప్రభావం

చైనాలో మరణ మృదంగం మోగిస్తోన్న కరోనా ప్రభావం శంషాబాద్‌ విమానాశ్రయంపై పడింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో యాత్రీకుల రాకపోకలపై UAE ఆంక్షలు విధించడంతో ఉమ్రా యాత్రీకులు ఎయిర్‌పోర్టు నుంచి వెనుదిరుగుతున్నారు. ఉమ్రా యాత్ర కోసం ఎయిర్‌ పోర్టుకు చేరుకున్న 250 మంది ప్రయాణికులకు ఎయిర్‌ పోర్టు అధికారులు తిరిగి వెనక్కు పంపారు.

ఇప్పటికే కరోనా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇందులో భాగంగా సౌదీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇతర దేశాల నుండి నిత్యం సందర్శనకు వచ్చే ఉమ్రా యాత్రీకులతో పాటు, ఇతర యాత్రీకులపై ఆంక్షలు విధించింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి 250 మంది ప్రయాణీకులు ఉమ్రా వెళ్లడానికి శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకున్నారు.. అయితే UAE ఆంక్షల నేపథ్యంలో వీరికి శంషాబాద్‌ ఎయిర్ పోర్టు అధికారులు నో చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story