నవీన్ పట్నాయక్ ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్న కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు

నవీన్ పట్నాయక్ ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్న కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు
X

ఒడిశాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన సందర్బంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ భువనేశ్వర్ లోని తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో కేంద్ర మంత్రులు అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లు పాల్గొన్నారు. కాగా మహిళలు, పిల్లలపై లైంగిక దాడులు, అత్యాచారాలు, భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దు మీదుగా పశువుల అక్రమ రవాణాను నివారించడం వంటి వాటిపై సత్వర దర్యాప్తు జరిపేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శుక్రవారం నాలుగు తూర్పు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో జరుగుతోంది. 12 ఏళ్లలోపు బాలికపై అత్యాచారం కేసుల్లో మరణశిక్ష విధించడంతోపాటు, లైంగిక నేరానికి కఠినమైన నిబంధనలను నిర్దేశిస్తూ, క్రిమినల్ లా సవరణ చట్టాన్ని 2018 లో కేంద్రం ఆమోదించినట్లు ఒడిశా ప్రభుత్వ అధికారులు తెలిపారు.

కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సిఆర్‌పిసి) కు చేసిన సవరణ దర్యాప్తు పూర్తి కావడానికి రెండు నెలల కాలపరిమితిని నిర్దేశించింది. సిఆర్‌పిసి సెక్షన్ 173 కు, భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) లోని 376, 376 ఎ, 376 బి, 376 సి, 376 డి, 376 డిఎ, 376 డిబి లేదా 376 డిఇ సెక్షన్లకు సవరణలను ప్రభుత్వం తీసుకువచ్చింది. అలాగే భారత-బంగ్లాదేశ్ సరిహద్దు గుండా పశువుల అక్రమ రవాణాను ఎలా నిరోధించాలో ఈ సమావేశంలో చర్చించనున్నారు. సరిహద్దు రాష్ట్రాలలో పశువుల అక్రమ రవాణాకు గురవుతున్నాయి. ఇవి రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్, యుపి, జార్ఖండ్, ఒడిశా, బీహార్ నుండి పశువులు పెద్దగా ఆటంకాలు లేకుండా బంగ్లాదేశ్ సరిహద్దుకు చేరుకుంటాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్) పశువుల అక్రమ రవాణాను ఆపడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ స్మగ్లర్లకు సహాయం అందుతూనే ఉంది.

Next Story

RELATED STORIES