అతను మరణించింది 'కరోనావైరస్' తో కాదు : కేరళ వైద్యులు

X
TV5 Telugu29 Feb 2020 6:01 PM GMT
శుక్రవారం కేరళలో 36 ఏళ్ల వ్యక్తి ఫ్లూ మరియు న్యుమోనియాతో మరణించాడు. అంతకుముందు రోజే మలేషియా నుండి కేరళకు వచ్చాడా వ్యక్తి. దాంతో అతనికి కొచ్చిన్ ఎయిర్ పోర్టులోనే కరోనా వైరస్ పరీక్షలు చేశారు. ఇందులో అతనికి కరోనా వైరస్ నెగిటివ్ అని తేలింది. అయినా అతను బాగా నీరసించి నడవలేని స్థాయిలో ఉన్నాడు. ఈ క్రమంలో వైద్యులు టెన్షన్ పడ్డారు. దాంతో గురువారం రాత్రి కొచ్చిన్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతను చనిపోయాడు. దాంతో అతను కరోనా వైరస్ కారణంగా మరణించాడని వైద్యులంతా ఖంగారు పడ్డారు. కానీ అతను ఫ్లూ మరియు న్యుమోనియా కారణంగా మరణించినట్టు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి సీనియర్ వైద్యుడు డాక్టర్ గణేష్ మోహనన్ తేల్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Next Story