పక్కా ప్రణాళికతో ఉరిశిక్షను వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్న నిర్భయ దోషులు!

పక్కా ప్రణాళికతో ఉరిశిక్షను వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్న నిర్భయ దోషులు!

నిర్భయ కేసులో నలుగురు దోషులు పక్కా ప్రణాళికతో ఉరిశిక్షను వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. చట్టంలో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని ఇప్పటికే ఉరిశిక్షను రెండు సార్లు వాయిదా వేయించుకున్నారు. నలుగురు దోషుల్లో ఇప్పటికే ముగ్గురు దోషులు తమకున్న న్యాయపరమైన అవాశాకాలన్నింటినీ ఉయోగించుకున్నారు.

అయితే, పవన్ గుప్తా మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అవకాశాలను వినియోగించుకోలేదు. మార్చి 3న ఉరిశిక్ష అమలుకానుండగా.. అతడు సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ వేశాడు. ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలని పిటిషన్ లో పేర్కొన్నాడు. అటు.. ట్రయల్ కోర్టు ఇచ్చిన డెత్ వారెంట్ పై స్టే విధించాలని అతడి తరఫు న్యాయవాది ఏకే సింగ్ పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ఉరిశిక్ష మరోసారి వాయిదాపడే సూచనలు కనిపిస్తున్నాయి.

పవన్ గుప్తాకు ఇంకా రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకునే అవకాశం కూడా మిగిలేవుంది. ఇప్పటికే ఈ కేసులో ముకేష్‌ కుమార్ సింగ్, వినయ్ కుమార్ శర్మ, అక్షయ్ కుమార్ క్యురేటివ్ పిటిషన్లతో పాటు.. రాష్ట్రపతి క్షమాభిక్ష అవకాశాలను వినియోగించకున్నారు. అయితే, వీరి పిటిషన్లన్నీ తిరస్కరణకు గురయ్యాయి. దీనిని సవాలు చేస్తూ ముకేష్‌, వినయ్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. వారి పిటిషన్లను సుప్రీం కోర్టు తిరస్కరించింది. క్షమాభిక్ష తిరస్కరణపై అక్షయ్ ఎలాంటి పిటిషన్‌ దాఖలు చేయలేదు.

ఇక, పవన్‌ గుప్తా క్యురేటివ్‌ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఉరిశిక్ష మరోసారి వాయిదా పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకా క్షమాభిక్ష ఉపయోగించుకునే అవకాశం కూడా ఉండటంతో ఉరిశిక్ష అమలుకు ఇంకెంతకాలం పడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story