ఢిల్లీ అల్లర్లపై కాంగ్రెస్‌ నిజ నిర్ధారణ కమిటీ

ఢిల్లీ అల్లర్లపై కాంగ్రెస్‌ నిజ నిర్ధారణ కమిటీ

ఢిల్లీ ఘర్షణలకు సంబంధించి వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఐదుగురు సభ్యులతో నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ బృందంలో ముకుల్ వాస్నిక్, తారిక్ అన్వర్, సుష్మితా దేవ్, శక్తిసింహ్ గోహిల్, కుమారి సెల్జా ఉన్నారు. కాంగ్రెస్ ప్రతినిధి బృందం ఈ ప్రాంతాన్ని సందర్శించి సోనియాగాంధీకి వివరణాత్మక నివేదికను సమర్పించనుంది.

ఢిల్లీలో జరిగిన హింసాకాండలో 42 మంది మరణించారు.. అంతేకాదు 300 మందికి పైగా గాయపడ్డారు. ఢిల్లీలో అల్లర్లపై సోనియా గాంధీ నేతృత్వంలో ఆ పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి మెమొరాండం సమర్పించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ హింసకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని ఆదేశించాలని ఈ సందర్భంగా వారు రాష్ట్రపతిని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story