గో ఎయిర్ విమానంలో రెండు పావురాలు..

గో ఎయిర్ విమానంలో రెండు పావురాలు..
X

అహ్మదాబాద్ నుంచి జైపూర్ వెళ్తున్న గో ఎయిర్ విమానంలోకి రెండు పావురాలు ప్రవేశించాయి. దాంతో కాసేపు ప్రయాణికులు ప్రత్యేక అనుభూతి పొందారు. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. అహ్మదాబాద్ విమానాశ్రయంలో గో ఎయిర్ విమానం టేకాఫ్ కోసం సిద్ధమవుతుండగా హఠాత్తుగా క్యాబిన్ లోపల పావురాలు దూరాయి. వీటిని సిబ్బంది గమనించారు. బయటికి పంపించేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ అవి విమానం లోపల అంతటా ఎగరడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో ప్రయాణికులు వాటిని తమ ఫోన్ కెమెరాల్లో చిత్రాలుగా బంధించారు. ఆ దృశ్యాలు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో ఆ వీడియో వైరల్ గా మారింది.

Next Story

RELATED STORIES