నమ్మి ఓటేస్తే నట్టేట ముంచిన జగన్‌ : అమరావతి రైతులు

నమ్మి ఓటేస్తే నట్టేట ముంచిన జగన్‌ : అమరావతి రైతులు

అమరావతి రాజధాని రైతులు చేపట్టిన ఆందోళనలు 75వ రోజుకు చేరుకున్నాయి.. మందడం, తుళ్లూరులో మహాధర్నాలు, వెలగపూడిలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. 29 గ్రామాల్లో ఎక్కడ చూసినా.. జై అమరావతి.. సేవ్‌ అమరావతి నినాదం మారుమోగోతోంది.. 75వ రోజు దీక్షల్లో భాగాంగ ఇవాళ పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, నేలపాడు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలు శిబిరాల్లో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.

తుళ్లూరులో రైతుల దీక్ష శిబిరానికి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం ఆయన దీక్షా శిబిరానికి చేరుకుని.. రైతులకు మద్దతుగా సంఘీభావం తెలపనున్నారు.. 75 రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై మండిపడుతున్న బీజేపీ.. ఉద్యమంపై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది..

నమ్మి ఓటేస్తే నట్టేట ముంచిన జగన్‌ తీరుతో తమకు కంటినిండా నిద్ర కరువైందంటున్నారు రాజధాని రైతులు. ఎవరిపై కక్షతో రాజధాని మారుస్తున్నారో.. YCP నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతిపై వేసిన కమిటీలన్నీ కుట్రలేనని.. న్యాయపోరాటం ద్వారా వీటిని అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

మరోవైపు రాజధాని రైతులకు రోజురోజుకీ మద్దతు పెరుగుతోంది. ఇతర జిల్లాల నుంచి కూడా రైతులు తరలివచ్చి సంఘీభావం తెలుపుతున్నారు.. 75 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా...ప్రభుత్వం ఎందుకు చర్చించడం లేదో చెప్పాలని నిలదీశారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ రైతుల్ని రోడ్డుపై పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story