నిరుద్యోగులకు శుభవార్త.. అందులో 30 వేల ఉద్యోగాలు..

X
By - TV5 Telugu |1 March 2020 10:03 PM IST
నిరుద్యోగులకు భారీ శుభవార్త వెలువడింది. ఫ్రెంచ్ టెక్ దిగ్గజం కాప్జెమిని ఈ ఏడాది 30 వేల మంది ఉద్యోగులను నూతనంగా నియమించుకోవాలని నిర్ణయించింది. దీంతో ఇప్పటికే భారతదేశంలో 1.15 లక్షల మందికి పైగా ఉద్యోగులున్న ఈ కంపెనీలో అదనంగా మరో 30,000 మంది ఉద్యోగులు చేరిపోనున్నారు. క్లయింట్ల డిమాండ్ అధికంగా ఉన్న కారణంగా వారిని నియమించుకోవాలని యోచూస్తోంది. ఇందులో ఫ్రెషర్లు మరియు అనుభవజ్ఞులైన నిపుణులు లేదా ల్యాటరల్ ఎంట్రీ లు ఉంటారని కాప్జెమిని ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అశ్విన్ యార్డి పిటిఐకి తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com